నెన్నెల ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన.

ఫోటో రైటప్: అవగాహన కల్పిస్తున్న కళాజాత బృందం.
బెల్లంపల్లి, జులై 7, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం అవడంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శు5 ఆర్థిక అక్షరాస్యతపై కళాజాత బృందం చేత అవగాహన కల్పించారు. రూ. 436 ద్వారా జీవనజ్యోతి బీమా పథకం, రూ.20 ద్వారా సురక్ష బీమా పథకం, రూ. 1000తో అటల్ పెన్షన్ యోజన మరియు ఎస్బిఐ జనరల్ బీమా పథకాల గురించి వివరించారు. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు సంవత్సరం లోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీ పొందవచ్చని, స్వయం సహాయక సంఘాలు నెలనెలా క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లించి లక్ష నుంచి 20 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉందని వివరించారు. ఖాతాదారులు పొదుపు చేసే విషయాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ సంతోష్, ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ చీర్ల సత్తెమ్మ – మొండన్న, సీనియర్ మేనేజర్ మనోహర్, సీఎస్పీ తిరుపతి, కళాజాత బృందం సభ్యులు వెంకటేష్, వెంకట రాం, స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు, ఖాతాదారులు పాల్గొన్నారు