నెన్నెల వీఆర్‌వోపై ఏసీబీ దాడి

నెన్నెల: నెన్నెల మండలకేంద్రంలో వీఆర్‌వోగా పనిచేస్తున్న మహ్మద్‌ ఇక్బాల్‌ దండి రాజు అనే వ్యక్తి దగ్గర్నుంచీ విరాసత్‌ పట్టాకోసం రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్‌ పట్టుకున్నారు. రాజు ఫిర్యాదు మేరకు అధికారి దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.