‘నెలాఖరులోగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తాం’
హైదారాబాద్: ఈ నెలాఖరులోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రాంగోపాల్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసీకి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్ర జనగణన లెక్కలకు , స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియకు వ్యత్యాసం ఉందన్నారు. ఈ నెల 18లోగా రిజర్వేషన్ల ప్రకారం నివేరికలను పంపాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు.