నెల్లూరు: ఊహించని విధంగా ఏపీ అభివృద్ధి
– రంగనాయకులపేట : రాష్ట్ర విభజన వల్ల ఎన్నడూ లేని విధంగా కేంద్రస్థాయిలో అనేక పరిశ్రమలు సీమాంధ్రలో కొలువుతీరుతున్నాయని, ఊహించని విధంగా ఏపీ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నదని దేవాదాయశాఖ మంత్రి పీ. మాణిక్యాలరావు అన్నారు. శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఆయన ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన వద్దంటూ ఆందోళన చేసిన నేతలు, ఉద్యమ కారులు నేడు పునారాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుత అభివృద్ధిని చూసి అప్పుడు ఎందుకు ఆందోళన చేశామా ? అని తమకు తామే ప్రశ్నించకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి బీజేపీని దోషి గా చేసేందుకు కొందరు పనికట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఎదు గుదలను ఓర్వలేకనే ఈ పన్నాగానికి పూనుకున్నారని తెలిపారు. సమైకాంధ్ర ఉద్యమం నడిపిన నేతలు కొంత కాలానికే అడ్రసు లేకుండా పోయారని, నేడు తిరిగి ప్రత్యేక హోదాపై రా ద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వారంతా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాల అభి వృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆత్మ కూరు ఏఎంసీ చైర్మన్ కు డుమల సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నేతలు దు వ్వూరు రాధాకృష్ణారెడ్డి, కందుకూరి సత్యనారాయణ, సీ హెచ్.రమణప నాయుడు, మిడతల రమే ష్, కేఎస్. చక్రధారి, మమతారెడ్డి, మొగరాల సురేష్, నరసింహులు నాయుడు, యరబోలు రాజేష్ పాల్గొన్నారు.