నేటితో ముగియనున్న తెదేపా సమీక్షలు
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు తెదేపా నిర్వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి మూడు రోజులపాటు 31 నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశాలకు 90 శాతానికిపైగా నేతలు హాజరుకావడం పట్ల పార్టీ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, నెల్లూరు, తిరుపతి పార్ల మెంటరీ నియోజకవర్గ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశం నిర్వహిస్తారు.