నేటినుంచి ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

మెదక్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఓటర్లకు చీటీలను ప్రతి ఇంటింటికీ తిరిగి అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ధర్మారెడ్డి బీఎల్‌వోలకు సూచించారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు ప్రతి ఓటరుకు అందజేయాలన్నారు. ఓటరు చీటీలతోపాటు ఓటు హక్కు వినియోగంపై రూపొందించిన కరపత్రాన్ని ఇవ్వాలన్నారు. కొత్తగా ఓటు హక్కును పొందిన వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని, వాటిని కూడా ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయాలన్నారు. పోలింగ్‌ రోజున గుర్తింపు కార్డులు లేకున్నా… ఓటరు చీటీలు చూపితే హక్కు వినియోగించడానికి పంపించాలన్నారు. పంపిణీ సమయంలో మృతులు, చిరునామా మార్చిన వారిని గుర్తించి… ఆ వివరాలను ఈఆర్వోకు అందజేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస

వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ ఫారం-12 తీసుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ పొందాలని సూచించారు.