నేటినుంచి వార్ మెమోరియల్ సందర్శనకు అనుమతి
చెన్నై,డిసెంబరు 15 (జనంసాక్షి):- స్థానిక కామరాజ్ రోడ్డులో విన్న ’వార్ మెమోరియల్’ను వీక్షించేందుకు ప్రజలకు ఈనెల 16వ తేదీ నుంచి అవకాశం కల్పించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు ఈ యుద్ధస్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించవచ్చు. 1971 యుద్ధ విజయం స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ అవకాశం కల్పించినట్టు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. 1971 ఇండో`పాకిస్తాన్ యుద్ధంలో సుమారు 93 వేల మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయిన తరువాత బంగ్లాదేశ్ విముక్తికి దారి తీసిన భారత దళాల విజయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 16వ తేదీన ’విజయ్ దివ్‌స’గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ విజయానికి 50 యాభవయ్యేళ్లు పూర్తి కావడంతో స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నారు.