నేటి నుంచి ఆరోగ్య శ్రీ వైద్య శిబిరం
భాగ్యనగర్,కరీంనగర్ జనంసాక్షి : జిల్లాలో నేటి నుంచి ఆరోగ్య శ్రీవైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 7 మంగళవారం రోజున కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామంలో, మే 14న సుల్తారాబాద్ మండల కేంద్రంలో, మే 21 న సిరిసిల్ల మండల కేంద్రంలో ,మే 23న తిమ్మాపూర్ మండల కేంద్రంలో ,మే 28న కమాన్‌పూర్ మండల కేంద్రంలో గుండారంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.