నేటి నుంచి చండీయాగం
మెదక్,డిసెంబర్ 22(జనంసాక్షి): అయుత చండీయాగానికి శుభఘడియలు మొదలయ్యాయి. బుధవారం ఈ యాగం నిర్వహణ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుణ్యాహవాచనం నిర్వహించారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తమ వ్యవసాయక్షేత్రంలో ఆయుత మహా చండీయాగానికి నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు ఆరంభపూజ నిర్వహించారు. మంగళవారం ఉదయం నిర్వహించిన త్రైలోక్య మోహన గౌరీ ¬మంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఉదయం గౌరీ¬మంతో పాటు గరు ప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదక శాంతి, ఆచార్యాది రుత్విగ్వరణం, మహా మంగళహారతి, మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఆయుత మహా చండీయాగానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సుమతి పరిశీలించారు. అయుత చండీయాగం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. లోక కల్యాణం కోసం నిర్వహిస్తున్న అయుత చండీయాగం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య బుధవారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభం కానుంది. చండీయాగంలో భాగంగా మక్కోటి ఏకాదశి పర్వదినాన అయుత చండీయాగానికి సీఎం కేసీఆర్ దంపతులు అంకురార్పణ చేశారు. ఇవాళ గౌరీ యాగం నిర్వహించనున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాగం నిర్వహించే ఎర్రవల్లికి ఐదు కిలోవిూటర్ల దూరం నుంచే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే చండీయాగానికి అనుమతి ఇవ్వనున్నారు. సీఎం వ్యవసాయ క్షేత్రంలోనే ఉండి యాగంలో పాల్గొననుండటం, యాగానికి నిత్యం వేల సంఖ్యలో జనం, ప్రముఖులు వచ్చే అవకాశాలున్నందున ఎర్రవల్లి, పరిసర గ్రామాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. వ్యవసాయ క్షేత్రం చుట్టుపక్కల ప్రత్యేక బృందాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, ప్రముఖులు వచ్చే రహదారుల్లో పోలీసు సిబ్బంది నిఘా కొనసాగుతోంది. ఎర్రవల్లి, నర్సన్నపేట, శివారు వెంకటాపూర్ తదితర గ్రామాల చౌరస్తాల్లో పోలీసు బృందాలు వాహనాలపై వచ్చిపోయే వారిని తనిఖీ చేసి పంపిస్తున్నాయి. జనం తాకిడిని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన రక్షణ చర్యలపై జిల్లా ఎస్పీ సుమతి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాగస్థలికి పలు జిల్లాల నుంచి వచ్చే ప్రజలు దారి తెలియక ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అధికారులు అక్కడక్కడ కీలక ప్రాంతాల్లో సూచికలు ఏర్పాటు చేశారు. యాగస్థలి నుంచి తిరుగు ప్రయాణం చేసేవారికి సులువుగా దారి తెలిసేందుకు హైదరాబాద్, భువనగిరి, గజ్వేల్, సిద్దిపేట, రాజీవ్ రహదారుల పేర్లతో మలుపుల వద్ద సూచికలు ఉంచారు. కొన్ని మార్గాల్లో రహదారుల మరమ్మతులు జరుగుతున్నందున తిరిగి వెళ్లేందుకు దారి మళ్లించిన విషయాన్ని సూచికల ద్వారా తెలియజేశారు. ఇటిక్యాల, జగదేవపూర్‌ల మధ్య రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున ఇటిక్యాల -అలీరాజపేట రహదారికి మళ్లిస్తూ సూచికలు ఏర్పాటు చేశారు. యాగస్థలి నుంచి హైదరాబాద్, భువనగిరి వెళ్లే మార్గాలను చూపుతూ కూడా సూచికలు ఉంచారు. చండీ యాగానికి వచ్చే కొత్తవారు దారి తెలియక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎర్రవల్లి నుంచి ప్రజ్ఞాపూర్, గౌరారం, నల్గొండ జిల్లా తుర్కపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు సూచికలు, స్టాపర్లు ఉంచి ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. ఈ యాగం ప్రారంభానికి గవర్నర్ నరసింహన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ బోంస్లే హజరుకానున్నారు. ఈ నెల 24వ తేదీన కేంద్రమంత్రులు వెంకయ్య, బండారు దత్తాత్రేయలు . 25వ తేదీన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ఈ యాగానికి రానున్నారు. 26వ తేదీన తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హజరవుతారు. కాగా యాగం ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. అయుత చండీయాగం నేపథ్యంలో కేసీఆర్ ఫాంహౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
కోమురవెల్లికి సిఎం కెసిఆర్
తెలంగాణలో అతి ముఖ్యమైన కొమురవెల్లి జాతరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాల్గొంటారు. కొమురవెల్లి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి ఆయన రానున్నారు. ఇది వరంగల్ జిల్లా పరిధిలో ఉన్నా సిద్దిపేటకు సవిూంలో ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా హెలిక్టాపర్ ద్వారా కొమురవెల్లి చేరుకుంటారు. మల్లన్న కల్యాణోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు ఇటీవల ఆలయ ధర్మకర్తలు సిఎంకు ఆహ్వాన పత్రాలు అందించారు. రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రెండోసారి సిఎం కొమురవెల్లికి రానున్నారు.