నేటి నుంచి ప్రచార హోరు

హైదరాబాద్: సోమవారం నుంచి పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తనున్నది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదలవుతుంది. దీనితోపాటే ఆయా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను కూడా రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. తొలి విడుతలో నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు అవకాశం ఉన్నది. సోమవారం నుంచి తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైకులతో ప్రచారం చేసుకోవచ్చునని.. అందుకు అనుమతి తప్పనిసరి అని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టంచేసింది.