నేటి నుంచి విద్యా సంబరాలు
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల హడావుడి శనివారం నుంచి ప్రారంభం కానుంది. విద్యా సంబరాల పేరుతో జూన్ ఒకటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. పాఠశాల్లో విద్యార్థుల చేరికను పెంచే దిశగా వివిధ కార్యక్రమాలు జూన్ నెలాఖరు వరకు జరగనున్నాయి. 12వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచే ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.