నేటి నుంచి వైద్య శిబిరాలు : కలెక్టర్
మెదక్, జూలై 20: జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు జూలై 21 నుండి 31 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. దినకర్ బాబు నేడోక ప్రకటనలో తెలిపారు. గుండె జబ్బులు, మూత్ర పిండాల వ్యాధి, కాలేయ జబ్బులు, నరాలు, ఎముకలకు సంబంధించిన జబ్బులు, పుట్టుకతో అంగవైకల్యం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి స్పెషలిస్టుల ఆధ్వర్యంలో నెట్ వర్క్ హస్పిటల్ప్ పంపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జూలై 21న జిన్నారం మండలం ఖాజీ పల్లి గ్రామంలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 23న పాపన్నపేట మండలం ఎల్లాపూర్, కొండపాక మండలం సిరిసినగండ్ల, టేక్మాల్ మండలం ఎల్లుపేట, నంగునూర్ మండలం ముండ్రాయి గ్రామలలో, 24న న్యాల్‌కల్ మండలం మామిడ్గి, కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామాల్లో, 25న మనూరు మండల కేంద్రంలో, కుల్చారం మండలం అమ్సాన్‌పల్లి గ్రామాలలో, 27న గెజ్వేల్ మండలం అక్కారం, జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామలలో, 28న తుఫ్రాన్ మండలం నాగులపల్లి, ములుగు మండలం క్షీరాసాగర్, శంకరంపేట(ఎ) మండలం కమలాపూర్, నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామలలో, 30న హత్నూర మండలం సికింద్లాపూర్, తొగుట మండలం ఎల్లారెడ్డి పేట గ్రామాలలో, 31న రేగోడ్ మండలం దేవనూర్, కౌడిపల్లి మండలం చండూర్ గ్రామంలో ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా మండలాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తెలుపు రేషన్ కార్డుతో వైద్య శిబిరాలకు వెళ్లి నిపుణులైన వైద్యులచే పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు పొందాలని కోరారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఆరోగ్య మిత్రలను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.