నేడు ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా
తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు బండి రమేశ్
శ్రీరాంపూర్, : బయ్యూరం ఉక్క తెలంగాణ హక్కు నినాదంతో తెరాస ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెరాస ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించనన్నుట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి రమేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చేపట్టనున్న ధర్నాకు తూర్పుజిల్లాలోని తెలంగాణవాదులు, తెరాస కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.