నేడు ఆ కండక్టర్లకు కౌన్సెలింగ్
ఆదిలాబాద్ అర్బన్, జనం సాక్షి: ఇది వరకు ఆర్టీసీలో బధ్యతలను నిర్వహించి ప్రస్తుతం నిధులకు దూరంగా ఉంటున్న 40 మంది కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని ఆర్టీసీ ప్రాతీయ పరిశీలనాధికారి వి. వెంకటేశ్వర్లు, పర్సనల్ అధికారి పి. విలాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సదరు కండక్టర్లకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి సదరు కండక్టర్లు పనివేళలో హాజరుకావాలని సూచించారు.