నేడు ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6 మ్యాచ్ సందర్భంగా ఇవాళ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వచ్చే అభిమానులు, నేతలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. స్టేడియానికి వచ్చే పలుచోట్ల వాహనాలను దారి మళ్లించనున్నారు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారుల గుండా వచ్చే భారీ వాహనాలను ఉప్పల్ కూడలి నుంచి దారి మళ్లించనున్నారు. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ కూడలి ద్వారా, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను తార్నాక నుంచి ఈసీఐఎల్, చెంగిచెర్ల మీదుగా మళ్లించనున్నారు. ఈ ఆంక్షలు మ్యాచ్‌లు జరిగే రోజుల్లో అమల్లో ఉంటాయని తెలిపారు.
స్టేడియం వద్ద భారీ బందోబస్తు
ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించిది. భద్రతను కట్టుదిట్టం చేసంది. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో రక్షణ చర్యలు కొనసాగేలా చర్యలు తీసుకుంది.