నేడు ఎంపీ వివేక్‌ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ :కాంగ్రెస్‌ ఎంపీ వివేక్‌ నివాసానికి తెరాస అధినేత కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం వెళ్లనున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఎంపీలు విధించిన ముగియనుండంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం తెరాసలో చేరికపై ఎంపీలు వివేక్‌, మందా జగన్నాథం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.