నేడు ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్,(జనంసాక్షి:) ఎంసెట్ `2013 ఫలితాలు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూలో ఉప ముఖ్యమంత్రి ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్. వి. రమణారావు తెలిపారు.