నేడు కాంగ్రెస్ రాష్ట్రస్థాయి సదస్సు
హైదరాబాద్ : స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సు నేడు జరగనుంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగే సదస్సుకు కాంగ్రెస్ జిల్లా, నగర, పట్టణ పార్టీ అధ్యక్షులు, నూతనంగా నియమితులైన మండల, బ్లాక్, డివిజన్‌స్థాయి అధ్యక్షులు , పీసీసీ జిల్లా పార్టీ సమన్వయ కర్తలు పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగే సదస్సులో ముఖ్యమంత్రి ఎస్. కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పలువురు మంత్రులు పాల్గొంటారు.