నేడు కురుమ సంఘం ఫంక్షన్ హాల్ పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి హరీష్ రావు

నంగునూరు, జూన్01(జనంసాక్షి):
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల శివారులో ఇందూర్ కాలేజ్ ప్రక్కన కెటాయించినటువంటి స్థలంలో కురుమ సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు నేడు భూమి పూజ చేస్తారని నంగునూరు మండల కురుమ సంఘం అధ్యక్షుడు బెదురు తిరుపతి కురుమ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు రూ.60 లక్షలు, ఎంఎల్సి యేగ్గే మల్లేష్ రూ.50 లక్షలు చొప్పున ఇచ్చారని చెప్పారు.భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎంఎల్సి యేగ్గే మల్లేష్ వస్తున్నందునా సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న కురుమ కులస్థులు అందరూ అధిక సంఖ్యలో రావాలని బెదురు తిరుపతి కోరారు.