నేడు కేంద్ర కెబినెట్‌ విస్తరణ

4

– కొత్తవారికి అవకాశం

న్యూఢిల్లీ,జులై 4(జనంసాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో 9 మందికి అవకాశం కల్పించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌ కు పెద్దపీట వేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. యూపీకి చెందిన భాగస్వామ్య పక్షం అప్నా దళ్‌ కు చెందిన బీసీ ఎంపీ అనుప్రియ పటేల్‌ కు కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. యూపీకి చెందిన పలువురు బీజేపీ నాయకులకు కూడా కేబినెట్‌ బెర్త్‌ ఖాయమంటున్నారు. మంత్రిపదవులు వస్తాయని భావిస్తున్న యూపీ బీజేపీ నేతలు సోమవారం అమిత్‌ షాను కలిశారు. రాజస్థాన్‌ బికనీర్‌ లోక్‌ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దళితనేత పీపీ చౌధురి కూడా కేబినెట్‌ లో చేర్చుకుంటారని సమాచారం. ఎస్‌ఎస్‌ ఆహ్లువాలియా, రాజ్యసభ సభ్యుడు విజయ్‌ గోయల్‌, ఉత్తరాఖండ్‌ దళిత ఎంపీ అజయ్‌ తమ్తా, గుజరాత్‌ రాజ్యసభ ఎంపీ పురుషోత్తం రూపాల, మహారాష్ట్ర ఆర్పీఐ ఎంపీ రామదాస్‌ అథవాలే, యూపీ ఎంపీ మహేంద్ర నాథ్‌ పాండే, యూపీ దళిత ఎంపీ క్రిషన్‌ రాజ్‌ లకు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. కొంత మంది మంత్రులను తప్పించే అవకాశముందంటున్నారు. అయితే సీనియర్‌ మంత్రులకు పదవీగండం లేదని సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన సమాచార ప్రతినిధి ఫ్రాంక్‌ నొరొన్హా ట్వీట్‌ చేశారు.బిజెపి శ్రేణుల్లో హడావిఇ కనిపిస్తోంది.  ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ నుంచి పలువురికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసంలో విస్తృత చర్చలు జరిపారు. అమిత్‌షా ఎంపీలతో వరుసగా సమావేశమయ్యారు. అనుప్రియ పాటిల్‌, ఎస్‌ఎస్‌ అహ్లువాలియా, విజయ్‌గోయల్‌, ఎంజే అక్బర్‌, పురుషోత్తమ్‌ రూపాల అమిత్‌షాతో సమావేశమైన వారిలో ఉన్నారు.  దీంతో కూడికలు తీసివేతపై షా దృష్టి పెట్టినట్లు సమాచారం.  పునర్‌వ్యవస్థీకరణలో నఖ్వీ, పీయూష్‌గోయల్‌కు కేబినెట్‌ ¬దా దక్కే అవకాశం ఉంది. మరోవైపు వయోభారంతో ఉన్నవారిని తప్పించనున్నారని సమాచారం. ఇదిలావుంటే  కేంద్ర కేబినెట్‌ విస్తరణ రేపు జరగాల్సి ఉండగా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కన్నెర్ర చేశారు. కేబినెట్‌ విస్తరణపై పుకార్లు కాకుండా అసలు విషయాన్ని స్పష్టం చేయాలని కుండబద్దలుకొట్టారు. కేబినెట్‌ విస్తరణలో శివసేనకు ఎన్ని మంత్రిపదవులిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌డిఏ భాగస్వామి అయిన శివసేన కేంద్ర కేబినెట్‌ విస్తరణకు ముందు ఇలా విూడియా ముందు వ్యాఖ్యలు చేయడంతో బిజెపి పెద్దలు తలలు పట్టుకున్నారు.