నేడు కోటగిరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాక.
కోటగిరి ఆగస్టు 30 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రానికి సెప్టెంబర్ 2 న కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ విచ్చేస్తున్నారని మండల పార్టీ బీజేపీ శాఖ నేతలు గురు వారం రోజున పత్రిక ప్రకటన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.లోక్ సభ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలో పి.ఎచ్.సి కేంద్రాన్ని శుక్రవారం రోజున ఉదయం 11-30 సమయంలో సందర్శిస్తారు.కావున ఈ కార్యక్రమానికి నియోజక వర్గ నాయకులు,ఆయా మండల,గ్రామాల కార్యవర్గ నాయకులు,ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు,అధికారులు,ప్రజలు అందరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.