నేడు నిజామాబాద్‌ కోర్టుకు అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు నేడు నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్బరుద్దీన్‌ రిమాండ్‌ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.