నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు
హైదరాబాద్ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స, వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస నాయకులు హరీశ్‌రావు, సీసీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావుతోపాటు పలువురు నేతలు హాజరుకానున్నారు.