నేడు మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌

ముంబయి: మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీన్‌ జట్లు తుది పోరులో తలపడుతున్నాయి. ఫైనల్లో గెలిచి ఆరోసారి ప్రపంచకప్‌ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా చూస్తుండగా… ఈ టోర్నీలో అందరి కంటే ఎక్కువ పాయింట్లతో ముందంజలో ఉన్న వెస్టిండీన్‌ చివరి మ్యాచ్‌లో నెగ్గి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. మ్యాచ్‌ మధ్యాహ్నం 2.30 నుంచి స్టార్‌క్రికెట్లో ప్రత్యేక్ష ప్రసారంకానుంది.