నేడు మెగా జాబ్‌ మేళా

ఉట్నూరు, న్యూస్‌లైన్‌: రాజీవ్‌ యువకిరణాలు పథకంలో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతీ యువకులను ఐటీడీఏటీపీఎంయూ, ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీవో మహేష్‌

శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కేబీ ప్రాంగణం పీఎమ్మార్సీ  మందిరంలో ఉదయం 10 గంటలకు మేళా ఉంటుదని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డులు, టైలరింగ్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెలికాలర్స్‌ తదితర రంగాల్లో అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. పదో తరగతి, ఆపై విద్యార్హత ఉన్న గిరిజన అభ్యర్థులు రేషన్‌కార్డు, ఫోటోలు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.