నేడు మెమన్‌కు ఉరి
– క్షమాభిక్ష పిటీషన్‌ను తిరిస్కరించిన సుప్రీం ధర్మాసనం, మహారాష్ట్ర గవర్నర్
న్యూఢిల్లీ,జూలై 29(జనంసాక్షి):
ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్ క్షమాభిక్షను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో అతడికి గురువారం ఉరిశిక్షను అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సుప్రీం 1993 ముంబయి పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. గురువారం ఉదయం 7గంటలకు నాగ్‌పూర్ జైలులో యాకుబ్‌కు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. డెత్ వారెంట్ పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. డెత్ వారెంట్ పిటిషన్‌పై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో అధికారులు ఉరిశిక్ష అమలుకు సిద్ధంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో శాంతి భద్రతలపై చర్చించేందుకు సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర డీజీపీ, ముంబయి పోలీస్ కమిషనర్లు సీఎంతో శాంతిభద్రతలపై చర్చించారు. ఇదిలావుంటే మెమెన్‌కు వ్యతిరేకంగా ముంబైలో ఆందోళన చేపట్టారు. అతడిని వెంటనే ఉరితీయాలని ఆందోళనకు దిగారు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా నిర్దారణ అయిన యాకుబ్ మెమెన్ కు క్షమాబిక్ష పెట్టడానికి సుప్రింకోర్టు మరోసారి తిరస్కరించింది. బుధవారం సుదీర్ఘ విచారణ అనంతరం మెమెన్ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీం తీర్పు ఇచ్చింది. విచారణ సరైన పద్ధతిలోనే జరిగిందని, మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేసి ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణలో ఎక్కడా లోపం జరగలేదని పేర్కొంది. తనకు క్షమాబిక్ష పెట్టాలని యాకుబ్ మెమెన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రింకోర్టు అంగీకరించలేదని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో మరణశిక్ష విధించాలన్న నిర్ణయానికి ఓకే చేసింది. గతంలో దాఖలైన క్యురేటివ్ పిటిషన్‌పై ఏర్పాటుచేసిన ధర్మాసనం సరైనదేనని సుప్రీం కోర్టు తెలిపింది. క్యురేటివ్ పిటిషన్‌పై మరోసారి విచారించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మెమన్ దాఖలుచేసిన పిటిషన్‌పై జ్టసిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట మెమన్ తరఫ న్యాయవాది రాజురామచంద్రన్ వాదనలు విన్పించిన సంగతి తెలిసిందే. అయితే మెమెన్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ మహారాష్ట్ర గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద మాత్రమే పెండింగులో ఉన్నాయని, వారు అంతిమ నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తనకు ఈ కేసు సంబందం లేదన్న మెమెన్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇతనికి ఉగ్రవాదంతో సంబంధం ఉందని కోర్టు అభిప్రాయపడింది. కాగా మహారాష్ట్ర గవర్నర్ కూడా క్షమాబిక్ష పిటిసన్ ను ఇప్పటికే తోసిపుచ్చినట్లు సమాచారం వచ్చింది.