నేడు రవీంద్రుడి జయంతి

కోత్‌కతా,మే7(జ‌నం సాక్షి): కవి, సంగీత విద్వాంసుడు, రచయిత, విద్యావేత్త అయిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 1861 మే 7న కోల్‌ కతాలో జన్మించారు. ఆయన తండ్రి ద్వారకానాథ్‌ ఠాగూర్‌ సంఘ సంస్కర్త. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సంప్రదాయ విద్యను అభ్యసించలేదు. 1880 నుండి కవి, రచయితగా జీవితం ప్రారంభించారు. 1900 వరకు సుమారు ఏడు సంపుటాలు కవిత్వం రాశారు. 1901లో ‘బంగ్లాదర్శన్‌’ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 1905లో బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ, ఎన్నో కవితలు వెలువరించారు. 1909 లో జలియన్‌ వాలా బాగ్‌ దురంతాన్ని నిరసిస్తూ బ్రిటీష్‌ వారి ‘సర్‌’ బిరుదును తిరిగి ఇచ్చేశారు. ఆయన రచించిన ‘గీతాంజలి’ గేయాలకు 1913లో నోబెల్‌ బహుమతి వచ్చింది. ఆయన నోబెల్‌ బహుమతి వచ్చింది. ఆయన నోబెల్‌ పురస్కారం పొందిన తొలి ఆసియా వాసి. 1921లో ‘విశ్వభారతి విశ్వవిద్యాలయం (శాంతి నికేతన్‌) స్థాపించారు. దానికి నోబెల్‌ బహుమతి సొమ్ముతో పాటు, తన రచనల రాయల్టీని ఇచ్చారు. సైన్స్‌ లో గల పరిజ్ఞానంతో ఐన్‌ స్టీన్‌ వంటి శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. వీరు రచించిన ‘జనగణమన’ మన జాతీయగీతంగానూ, ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ గీతం బంగ్లాదేశ్‌ జాతీయ గీతంగానూ ఉన్నాయి. ‘గురుదేవ్‌’గా పిలువబడిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తన సాహిత్యాన్ని, శాంతినికేతన్‌ విశ్వవిద్యాలయాన్ని, నోబెల్‌ బహుమతిని, జాతీయగీతాన్ని మనకు వదిలి తాను 1941 ఆగస్టు 7న ఈ ప్రపంచాన్ని వీడారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని మనసారా స్మరిద్దాం.