నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11.30 గంటలకు హోటల్ తాజ్‌కృష్ణాలో జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. 2013`14 వ్యవసాయ రంగం ప్రగతిపై చర్చతోపాటు రైతు రుణాలు, పెట్టుబడి రాయితీ, నగదు బదిలీ, మహిళలకు రుణ సౌకర్యం, కిసాన్ క్రెడిట్ కార్డు పథకం, పావలా వడ్డీ చెల్లింపులు తదితర అంశాలపై చర్చించనున్నారు.