నేడు రేపు పెన్‌డౌన్‌కు పిలుపు – వైద్య ఉద్యోగుల ఆందోళన ప్రకటన
నిజామాబాద్,జనం సాక్షి ): తెలంగాణ రాష్టా వైద్య , ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అని యూనియన్ల ఐక్య సంఘటన జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేనెల 1, 2 వ తేదీల్లో పెన్ డౌన్ చేపడుతునట్టుగా నిజామాబాద్ జిల్లా చైర్మన్ దాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వైద్య ,ఆరోగ్య శాఖల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడు జిల్లా ఆసుపత్రుల్లో ఉద్యోగులందరు నల్లబ్యాడ్జిలు ధరించి వైద్య సేవలు అందించకుండా సహాయ నిరకారణతో నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక మంగళవారం జరిగే అమ్మ ఒడి, బుధవారం జరిగే వ్యాధినిరోధక టికాల కార్యక్రమాలను బహిష్కరిస్తామని అన్నారు. మే 4 వ తేదీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాలు, 8వ తేదీన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ఎదుట మహా ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేస్తూ, వైద్య ఉద్యోగుల సమస్యలనీ పరిష్కరించాలని కోరారు. అలాగే సుప్రీమ్ కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెలిస్తూ సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని అన్నారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సంజీవ్ జార్జ్, కన్వీనర్ చిట్టిబాబు, కోశాధికారి నవీన్, నాయకులు నటరాజ్, వెంకటేశ్వర్లు, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు…
————–