నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

మామడ, జనంసాక్షి: జిల్లాలోని అన్ని డిస్కం ఉపడివిజనల్‌ కార్యాలయాల్లో  బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని  నిర్వహించనున్నారు.వినియోగదారులకు సంబదించిన ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ డివిజనల్‌ పరిధిలోని అన్ని ఉపడివిజన్‌ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో  ఉండి వినియోగదారుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు.  తప్పుడు బిల్లులు, మీటర్లు పనిచేయక పోవడం, తీగలు వేలాడటం.. వంటి ఎలాంటి సమస్యలున్నా వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావచ్చని ఖానాపూర్‌ ఏడీఈ శ్రీనివాసరావు చెప్పారు.