నేడు శ్రీరామ పట్టాభిషేకం
భద్రాచలం,జనంసాక్షి: భద్రాచలం పుణ్యక్షేత్రం మిథిలాస్టేడియంలో శనివారం నిర్వహంచే శ్రీరామపట్టాభిషేకానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రామాలయంలో సాంప్రదాయ పూజలు అనంతరం శ్రీరామచంవూదుడు పట్టాభిషేక ప్రాంగణానికి బయలుదేరి వస్తాడు. 18కలశాలతో అర్చక స్వాములు ముందు నడుస్తుండగా… శ్రీరాముడు కల్యాణ మండపానికి చేరుకుంటారు. ఆరాధన, విశ్వక్సేణపూజలు నిర్వహించి పాదుకలు, రాజదండం, రాజమువూదిక, స్వరకిరీటం, స్వరచక్షికాలకు పూజలు జరుపుతారు. పట్టాభిషేక సర్గపారాయణం చేస్తారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పుష్కర నదుల జలాలతో మహాకుంభ తీర్థవూపోక్షణ చేస్తారు. ఈ భూ మండలానికి రాజుగా ఉండాలని ప్రోక్షణ నిర్వహించి 11శ్లోకాలతో మంగళ ఆచరణ చేస్తూ….. హారతి ఇవ్వడంతో ఈక్రతువు ముగుస్తుంది.
హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్……
శ్రీరామపట్టాభిషేక వేడుకకు రాష్ట్ర గవర్నర్ కే నర్సింహన్ హాజరుకానున్నారు. ఉదయం 7.40 నిమిషాలకు హైదరాబాద్‌లో బయలుదేరి 9 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. 10 గంటల నుంచి 12 గంటల మధ్య జరిగే శ్రీరామమహాపట్టాభిషేకంలో పాల్గొంటారు. భోజనం అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.