నేడు సభలో కేంద్ర రైల్వే బడ్జెట్‌ బాదుడు బరాబర్‌

కేటాయింపులే అనుమానం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి):
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పవన్‌ కుమార్‌ బన్సల్‌ తొలిసారిగా మంగళవారం రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టబోతున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తరవాత ఇప్పుడు బడ్జెట్‌ ప్రవేశ పెట్టే ఛాన్స్‌ కాంగ్రెస్‌కు వచ్చింది. అయితే బడ్జెట్‌కు ముందే ధరల మోత మోగించిన బన్సల్‌ ఇక మరిన్ని విధాలుగా వాతలు పెట్టే అవ కాశాలు ఉన్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు, విస్తరణ తదితర అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోం హహ నా రైల్వే ఛార్జీల పెంపు ఉండకపోవచ్చు. బడ్జెట్‌లో ఏముం టుందన్నది ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. రైల్వే బ్జడెట్‌ రూపకల్పనపై బన్సల్‌ ఇప్పటికే ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌, ఆర్థికమంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం అధికారు లతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఛార్జీల పెంపు అవకాశాలపై ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే సవిూప భవిష్యత్తులో సాధారణ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి
మళ్లీ పెంపు ఉండకపోవచ్చునని కాంగ్రెస్‌లోని వర్గాలు అంచనాౖ /ళిస్తున్నాయి. రాజస్థాన్‌, కర్నాటక, ఢిల్లీ తదితర రాష్టాల్రకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్టాల్రను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు ఉండవచ్చు. మన రాష్టాన్రికి సంబంధించి ప్రతి బడ్జెట్‌లోనూ పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. ఇక్కడి నుంచి లాబీయింగ్‌ లేకపోవడం కూడా ఓ కారణంగా భావించాలి. ఇప్పుడు రైల్వేశాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి ఉన్నా ఏ మేరకు ప్రయోజకరంగా ఉందన్నది బడ్జెట్‌ కేటాయింపులను పరికిస్తే తప్ప తేలదు. మరిన్ని లోకల్‌, సబర్బన్‌ రైళ్ల కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో… రాజస్థాన్‌లో వేయికోట్లతో మెయిన్‌లైన్‌ ఎలెక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌(మెమూ) ఏర్పాటు ప్రతిపాదనను మంత్రి ప్రకటించవచ్చు. ప్రమాద సమయాల్లో శీఘ్రగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకోసం సామగ్రిని చేరవేసేందుకు వీలుగా… ఈ బ్జడెట్‌లో రెండు అత్యంత వేగంగా నడిచే ప్రమాద సహాయక రైళ్ల(స్పార్ట్‌)ను మంత్రి ప్రకటించవచ్చు. గత ఏడాది మార్చిలో రైల్వేలు సరకు రవాణా ఛార్జీల్ని పెంచినప్పటికీ… ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.89,339 కోట్ల సరకు రవాణా లక్షాన్ని రైల్వే చేరుకోలేదు. నిధుల కొరత ఉన్నప్పటికీ… ఈ బ్జడెట్‌లో కొత్త లైన్లు, విద్యుదీకరణ, గేజి మార్పిడి, డబ్లింగ్‌లాంటి పలు పెండింగ్‌ ప్రాజెక్టుల్ని ప్రకటించవచ్చు. ప్రస్తుతం దాదాపు రూ.1.47 లక్షల కోట్ల విలువైన 347 రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. కొత్తగా 16 వేల వ్యాగన్ల తయారీనీ ఈ బ్జడెట్‌లో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాదాపు 70 భారీ సరకు రవాణా రైళ్లను రైల్వే ప్రతిపాదించవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల చేరవేత ద్వారా రూ.36,000 కోట్లు సమకూర్చుకోవాలని రైల్వేలు నిర్దేశిరచుకోగా… గత 10 నెలల్లో కేవలం రూ.25,924 కోట్లే వచ్చాయి. రైల్వే బ్జడెట్‌ కోసం ప్రభుత్వం నుంచి రూ.38 వేల కోట్ల బ్జడెట్‌ మద్దతు కావాలని రైల్వేలు కోరగా… రూ.28 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వేల వార్షిక ప్రణాళిక రూ.65 వేల కోట్లకు చేరుకోవచ్చు. డీజిల్‌ ధరలపై పాక్షికంగా నియంత్రణ ఎత్తివేసిన నేపథ్యంలో.. ప్రయాణికులు, సరకు రవాణా ఛార్జీలు కొంతినా పెంచాలని రైల్వేలపై తాజాగా ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వేమంత్రి పవన్‌ బన్సల్‌ అనివార్యంగా ఛార్జీల్ని పెంచుతారా? ఈ సంగతి తేలాలంటే మంగళవారం దాకా ఆగాల్సిందే. డీజిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ఛార్జీలు పెంచక తప్పకపోవచ్చునని బన్సల్‌ ఇటీవల సంకేతాలిచ్చారు. దీంతో ఫిబ్రవరి 26న ఆయన సమర్పించబోయే తొలి బ్జడెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేటరింగ్‌ సేవల మెరుగు, /-టసేషన్‌ల అభివృద్ధి, వంద కొత్త /-టసేషన్ల ప్రారంభం లాంటి పలు ప్రోత్సాహక నిర్ణయాల్ని ఆయన ప్రకటించవచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైల్వే రూ.6,600 కోట్ల అదనపు రాబడిని సమకూర్చుకోవడం కోసం జనవరి 22వ తేదీన కొద్దిమేర ఛార్జీల్ని పెంచిన సంగతి తెలిసిందే.