నేడు సైన్స్‌ కాంగ్రెస్‌

సిద్దిపేట,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   27వ జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను 6న స్థానిక ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావు, జిల్లా సైన్స్‌ అధికారి మహేందర్‌ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్‌ సంబంధిత ప్రదర్శన అంశం చార్ట్‌ రూపంలో, లాగ్‌ బుక్‌, 3 సెట్ల ప్రాజెక్టు అంశాలతో విద్యార్థి, గైడ్‌ టీచర్లు హాజరు కావాలన్నారు.