నేడు హైదరాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని ఆయన ఉదయం ఇందిరా ప్రియదర్శిని అడిటోరియంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ నుంచి ఓల్డ్‌ బాంబే హైవేకు వెళ్లే రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత టోలిచౌకి జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి , టోలిచౌకి నుంచి గచ్చిబౌలి రహదారి, మొఘల్‌కానాలా నుంచి పురానాపూల్‌ వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సాహెబ్‌నగర్‌లో కృష్ణా జలాల మూడో దశ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.