నేను ‌త్రినేత్రుడను…నేను కవిని

నేను నీ ఆత్మను‌ నీ అంతరంగం తెలిసినవాన్ని
నేను నీ నీడను నీ బాహ్య సౌందర్యం ఎరిగినవాన్ని
నేను కవిని కవితలో నీ కన్నీటి పన్నీటి గాథలు వినిపిస్తా

నేను మనస్తత్వ శాస్త్రం చదివిన ఓ మానసికనిపుణ్ని
పుస్తకాన్ని చదివినట్టు నీ మనస్తత్వాన్ని చదవగలను
అనుమానపడేవాడికి ఆధారాలు ఉండవు ఊహాలుతప్ప
మానసిక శాస్త్రవేత్తలకు సాక్ష్యాలు ఉంటాయి ఖచ్చితంగా

ఒక చిత్రాకారుడు ముందే ఊహించి
ఒక రంగుల దృశ్యాన్ని గీచినట్టుగా…
ఒక దర్శకుడు ముందే ఊహించి
ఒక సూపర్ హిట్ సినిమా తీసినట్టుగా…
ఒక శిల్పి ముందే ఊహించి
ఒక సుందర శిల్పాన్ని చెక్కినట్టుగా…
ఒక అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలో
అందమైన ఆ చందమామను అద్దంలో చూపినట్టుగా…

నీ ప్రతి ‌పని వెనుక…
నీ ప్రతి‌ నవ్వు వెనక…
నీ ప్రతి నడక వెనుక…
నీ ప్రతి మాట వెనుక…
నీ ప్రతి చూపు వెనుక…
నీ ప్రతి నిర్ణయం వెనుక…

ఏ దురాలోచన దాగుందో…
గతంలో ఏ ఘోరం జరిగిందో…
భవిష్యత్తులో ఏం జరగబోతుందో…
ముందే ఊహించి చెప్పగలను
ఖచ్చితంగా ఋజువులతో సహా…

కారణం నేను నిన్ను…
నీ చుట్టూ పరిసరాలను…
నీవున్న ఈ సమాజాన్ని….
నీవు నిర్మించుకున్న నీ ప్రపంచాన్ని…
నీవు సృష్టించుకున్న ఈ బంగారు లోకాన్ని…
నా “కలంకంటితో” చూడగల త్రినేత్రుడను…నేను కవిని !

రచన:
“కవి రత్న”
“సహస్ర కవి”
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి…9110784502