నేనైతే భార్యకే సహాయం చేసేదాన్ని

1

– చట్టాన్ని ఉల్లంఘించను

– సుష్మా ప్రశ్నకు సోనియా జవాబు

– నాలుగోరోజూ కొనసాగిన కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌7(జనంసాక్షి):  లలిత్‌ మోదీ అంశం పై గురువారం లోక్‌సభలో కేంద్రమంత్రి సుష్మారాజ్‌ చ ేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు.  లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడు తూ… తాను కేవలం క్యాన్సర్‌తో బాధపడుతున్న లలి త్‌మోదీ భార్యకు మాత్రమే సహాయం చేశానని, నా స్థా నంలో సోనియాగాంధీ ఉంటే ఏం చేసేవారని ప్రశ్నిం చారు. సుష్మాస్వరాజ్‌ ప్రశ్నకు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. ఆ స్థానంలో తాను ఉంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళకు

సోనియా ఎద్దేవా చేశారు. ఆమె మాటలు మాట్లాడడంలో దిట్టని అన్నారు. సుష్మా ప్రకటనపై రాహుల్‌ కూడా తీవ్రంగానే స్పందించారు. సుష్మా సాయం కోసం లలితో మోడీ నుంచి ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. మాటలతో నిజాలను మభ్య పెట్టలేరన్నారు.లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వరుసగా నాలుగోరోజు కూడా కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన కొనసాగింది. శుక్రవారం కూడా సోనియా, రాహుల్‌ వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సీనియర్‌ నేతలు ఆనంద్‌శర్మ, గులాంనబీ ఆజాద్‌, మల్లిఖార్జున్‌ ఖర్గే,  తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాజీనామాలపై ఎలాంటి రాజీ లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తప్పుకోవాల్సిందేనని అన్నారు. తెలంగాణకు చెందిన హన్మంతరావు, ఆనంద భాస్కర్‌ తదితరులు ప్లకార్డులో ముందు వరుసలో ఉన్నారు. జ్యోతిరాదిత్య తదితరులు నినాదాలు చేస్తూ ఉత్సాహపరిచారు. ఇదిలావుంటే

చిదంబరం మండిపాటు

వివాదాస్పద వ్యక్తి, ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌మోదీ వీసా విషయంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పార్లమెంటులో ఇచ్చిన వివరణపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత చిదంబరం  పలు ప్రశ్నలు సంధించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న లలిత్‌మోదీ భార్యకు మాత్రమే తాను సహకరించానని, లలిత్‌మోదీకి కాదని సుష్మాస్వరాజ్‌ నిన్న లోక్‌సభలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఎవరు నిజం చెప్తున్నారనుకోవాలంటూ చిదంబరం ప్రశ్నించారు. ఈ విషయంపై ముగ్గురు వ్యక్తులు భిన్నమైన సమాధానాలు చెబుతున్నారని ఆయన అన్నారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, బ్రిటీష్‌ హైకమిషనర్‌ బేవన్‌, బ్రిటీష్‌ ఎంపీ కీత్‌ వాజ్‌లలో ఎవరు చెప్పేది నమ్మాలని ఆయన అడిగారు. అయితే ఎలా చేసినా సుష్మాది తప్పేనని అన్నారు.

తాజావార్తలు