నేరాలు అరికట్టేందుకు సహకరించాలి: డీఎస్పీ
మంథని, జనంసాక్షి: గ్రామాల్లో నేరాలు అరికట్టేందుకు సహకరించాలని గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంథని మండలంలోని 8 గ్రామాల్లో రక్షక కమిటీలు నెలకొల్పగా వారికి మంగళవారం వాలీబాల్స్, టార్చిలైట్లు పంపిణీ చేశారు. వేసవిలో గ్రామాల్లో చోరీలు అధికంగా జరిగే అవకాశం ఉందని, గ్రామ రక్షక దళాలు వీటిని అరికట్టేందుకు నిఘాపెంచాలన్నారు. గ్రామరక్షక దళాల్లో ఐక్యత పెంచేందుకు వాలీబాల్స్ ఇస్తున్నామని చెప్పారు. సీఐ రమేష్, ఎస్సై నరేష్ పాల్గొన్నారు.