నేరాల నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి

– గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ సూరం వేణుగోపాల్ జనంసాక్షి , కమాన్ పూర్ :
రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.,(డిఐజీ),పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్, గోదావరిఖని ఏసీపీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు గోదావరిఖని 2 టౌన్ సీఐలు సూరం వేణుగోపాల్, అఫ్జలుద్దీన్, స్థానిక కమాన్పూర్ ఎస్సై బెతి రాములు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించి ఇళ్లను సోదాలు చేశారు.వాహన పత్రాలు సరిగా లేని 40 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోలు సీజ్ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు ఫైన్లు విధించారు.
ఈ సందర్భంగా సూరం వేణుగోపాల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ… నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇల్లు అద్దెకొరకు మీ దగ్గరకు వస్తే వారి పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి ఆధార్ కార్డ్ తీసుకోవాలి ఏమైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ, ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు అనే భరోసా నమ్మకం కలిగించే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం లో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ పోలీసింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100కు గాని 2టౌన్ సీఐ నెంబర్ 8712656520 కమాన్పూర్ ఎస్సై గారి నెంబర్ 8712656523 కి ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని మనకు తెలిసినటువంటి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లను లింకును ఓపెన్ చేయొద్దు అని, అత్యాశకు పోయి లాటరీ వచ్చిందని, లోన్ వచ్చిందని వచ్చిన, ఏదైనా గిఫ్ట్ లు వచ్చాయని ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజ్ లు వచ్చినా వెంటనే వాటికి సమాధానమిస్తూ ఓటిపి లను పిన్ నెంబర్ లను చెప్పకూడదు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ట్లయితే వెంటనే 1930 లేదా డయాల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.మహిళలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నచో రామగుండం కమిషనరేట్ పరిధిలో గల షి టీం 6303923700 నెంబర్ కు ఫోన్ చేసినట్లయితే తక్షణ పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 2టౌన్ సిఐ-2 అఫ్జలుద్దీన్, కమాన్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ బేతి రాములు , సబ్ ఇన్స్పెక్టర్లు ఎం చంద్రశేఖర్, ఫరీద్, గోదావరిఖని టూ టౌన్, కమాన్పూర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.