నైజీరియాలో 46మందిని కాల్చిచంపిన దుండగుడు

 

నైజీరియా: ఉత్తర నైజీరియాలో సోమవారం రాత్రి ఓ దుండగుడు ఉన్మాదంతో రెచ్చిపోయాడు. యూనివర్శిటికి చెందిన వసతిగృహంలో ఆ దేశ స్వతంత్య్ర దినాన 46మందిని కాల్చి చంపాడు. ముబిలోని అడమావా స్టేట్‌ యూనివర్విటిలో ఈ దారుణం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చి అతడు విద్యార్తులను వరుసగా నిలబెట్టి తమను తాము పరిచయం చేసుకోవాలన్నాడు. పేర్లు చెప్పిన వారిలో కొందరిని వదిలిపెట్టి మిగిలిన వారిని విచక్షణరహితంగా కాల్పులు జరిపి చంపాడు. బోకో హరామ్‌ అనే ఉగ్రవాద సంస్థ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.