నైతిక విలువల శిక్షణ తరగతి గదుల్లోనే సాధ్యం

గవర్నర్‌

హైదరాబాద్‌ : సమాజంలో నైతిక విలువల శిక్షణ, అభివృద్ధి తరగతి గదుల్లోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్‌ ప్లాటినమ్‌ జూబ్లీ కార్యక్రమానికి ఆయన తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యంలో కలిసి హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం గవర్నర్‌ను ఘనంగా సత్కరించింది. అనంతరం నరసింహన్‌ మాట్లాడుతూ మానవత్వం, నైతిక విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కాపాడాల్సిన బాధ్యత విద్యా సంస్థలు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. సాధారణ చదువులతో సమాజానికి మేలు జరగదని చెప్పారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలదేనని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు.