న్యాయంతో పాటు సామాజిక స్పృహ

న్యాయస్థానాలు న్యాయం అందించడంతోపాటు సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు బోథ్ జూనియర్ సివిల్ జడ్జి బి హుస్సేన్ తెలిపారు. జాతీయ న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించగా, ఆ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్య ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. న్యాయస్థానాలు కేవలం న్యాయ పరిరక్షణకే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల దృక్పథంతో ముందుకు సాగేలా ఇకముందు కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్ న్యాయవాదులు అడెపు హరీష్ కుమ్మరి విజయ్, బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రవీంద్ర ప్రసాద్,సర్పంచ్ సురేందర్ యాదవ్ వైద్యులు శైలజ, హెడ్ మాస్టర్ బాలకృష్ణ తదితరు పాల్గొన్నారు.