న్యాయం అందని బ్రహ్మపదార్థం

-దేశంలో పేదలకు న్యాయం అందని ద్రాక్షగా మారింది. న్యాయం పొందడం ప్రతిపౌరుడి ప్రాథమిక హక్కు. కానీ ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతన్న వారెందరో ఉన్నారు. కారణం సరైన కోర్టులు, న్యాయమూర్తులు లేకపోవడమే. దీనికి ప్రభుత్వమే కారణం. కొత్తగా కోర్టును ఏర్పాటుచేసి జడ్జిలను నియమింక పోవడంతో ఏళ్లకు పైబిడి కోర్టుకేసులు తేలడం లేదు. పెద్దల కేసులతోనే కోర్టులకు సమయం చాలడం లేదు. అనేక వివాదాలు, ప్రబుత్వ వైఫల్యాల కారణంగా కోర్టుల పటిష్టతకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అంతెందుకు రాష్టాన్న్రి విభిజించి అన్నీ పంచుకునే స్టేజి వచ్చినా హైకోర్టు విభజన మాత్రం రాజకీయాల కారణంగా నిలిచిపోయింది. దీంతో ఇరు రాష్టాల్రకు న్యాయంజరగడం లేదు. ఇకపోతే దేశంలో జనాభా శాతానికి తగ్గట్టుగా న్యాయమూర్తుల శాతం లేకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 170 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా చీఫ్‌ జస్టిస్‌ చెప్పడం చూస్తే న్యాయమూర్తుల నియామకంలో ఎంతగా జాప్యం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి ఇటీవల తీసుకువెళ్లానని, ఆ నియామకాలను త్వరగా చేపట్టాలని కోరానని కూడా సిజె చెప్పారు.  న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని దానికనుగుణంగా నడుచుకోవడం ప్రస్తుతం సవాల్‌గా మారిందని అన్నారు. దేశవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి 1987లోనే 44 వేల మంది న్యాయమూర్తులను నియమించాలంటూ లా కమిషన్‌ సూచించిందని, అయితే ఇప్పటికీ దేశంలో 18 వేల మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు 70 వేలకు మించి న్యాయమూర్తుల అవసరం ఉందని స్పష్టం చేశారు. అంటే న్యాయవ్యవస్థ ఎంతగా మెల్లగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో న్యాయాన్ని నాలుగు పాదాలపై నడిపించాల్సిన న్యాయ వ్యవస్థ నియామకాలు కొరవై కుంటుతోందని సాక్షాత్తు సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌ ఆవేదన చెందడం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని సమక్షంలోనే గతంలో ఓ మారు ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి సభా సమక్షంలో మొరపెట్టు కోవడం సామాన్యుడికి న్యాయం అందించడంలో వివిధ ప్రభుత్వాలు చూపుతున్న నిర్లక్ష్యాన్ని వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యయమూర్తి ఠాకూర్‌  భావోద్వేగంతో కంటతడిపెట్టారు. ఇప్పుడు ఒడిషా కటక్‌లోనూ ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు న్యాయం అందడం లేదన్నారు. ప్రస్తుతం  అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిన తరుణంలో ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఇంకా నమ్మకం మిగిలింది. దీనిని కూడా నిర్వీర్యం కాకుండా చూడాలన్నదే ప్రధాన న్యయమూర్తి ఆదేవదనగా ఉంది. అయితే ఆయన ఆవేదనపైనా మోడీ సర్కార్‌ కనీసంగా దృష్టి సారించి ఉండరు. అలా చేసివుంటే మరోమారు జస్టిస్‌ ఠాకూర్‌ ఇంతగా విలపించేవారు కాదు. న్యాయవ్యవస్థపై  జనం పెట్టుకున్న నమ్మకాన్ని నీరుగార్చేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారనడానికి ఇంతకన్నా సందర్భం అవసరం లేదు. చీఫ్‌ జస్టిస్‌ బహిరంగ కంటతడితో న్యాయస్థానాల వాస్తవ స్థితి గతులు  ప్రతి రోజూ కోర్టు మెట్లు ఎక్కుతూ తమ కేసుల పరిష్కారం కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న కక్షిదార్లకు ఈ విషయం నిత్యానుభవమే. ప్రజలకు తక్షణ న్యాయం సంగతేమో, అసలు ఈ జన్మకి తనువు

చాలించేలోపైనా కేసులు తెములుతాయా అనే సందేహాలు కోర్టు బాధితులను ఆందోలన కలిగిస్తున్నాయి. చిన్న కేసులు సైతం సంవత్సరాలకు సంవత్సరాలు సాగుతూ ఉంటే ఇక బాధితులకు తక్షణ న్యాయం అనేది అందని ద్రాక్ష పండుగా మారింది.  ఠాకూర్‌ వెల్లడించిన వివరాల ప్రకారమే దేశం మొత్తవ్మిూద అన్ని కోర్టుల్లో కలుపుకొని ఐదు కోట్ల కేసులు పేరుకుపోగా అతికష్టం విూద రెండు కోట్ల కేసులు పరిష్కారమయ్యాయి. ఇంకా మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టుకు వెళితే తమ సంగతి అంతేనని భయపడుతున్న రోజులివి. అందుకే మళ్లీ గ్రామాల్లో పెద్దల సమక్షంలో ఒప్పందాలకు ప్రాధాన్యంపెరిగింది.

మధ్యవర్తుల ప్రమేయంపెరిగింది. భూ కేసులుమొదలు, విడాకులు, చిన్నచిన్న పిటీ కేసులు ఎన్నో కోర్టుల్లో మూలుగు తున్నాయి. న్యాయం దొరక్క ఎందరో అభాగ్యులు విచారణ దశలోనే జైళ్లలో మగ్గుతున్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల జనం సమిధలవుతున్నారు. వేలాది మంది అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారు. జనాభా అయితే పెరిగింది తప్పించి న్యాయాధికారుల రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు బాధ్యత ప్రభువులదే. లా కమిషన్‌ సూచన మేరకు 40 వేల మంది జడ్జిలను నియమించాలి. జడ్జి పోస్టులు ఖాళీగా పెట్టుకొని ప్రజలకు తక్షణ న్యాయం అందిస్తామంటూ చెప్పడం వంచనే. చీఫ్‌ జస్టిస్‌ బాధను అర్థం చేసుకున్నామన్న ప్రధాని అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన నిర్ణయంపైననే సామాన్యులకు న్యాయం ఆధారపడి ఉందని గ్రహించాలి. చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌కు అండగా ప్రభుఏత్వం నిలబడే రోజు రావాలి.