న్యాయవాది మల్లారెడ్డి హంతకులను అరెస్ట్ చేయాలి
ఎఐఎఫ్‌బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
న్యాయవాది మల్లారెడ్డి హంతకులను అరెస్ట్ చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని పార్టీ ఆఫీస్‌లో ఆయన మాట్లాడుతూ న్యాయవాది మల్లారెడ్డి హత్య శోచనీయన్నారు.
ములుగు జిల్లా పందికుంట బస్ స్టేజీ వద్ద గత సోమవారం రాత్రి హత్యకు గురైన న్యాయవాది ములగుండ్ల మల్లారెడ్డి (65) హత్య వెనుక ఉన్న నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా పట్టుకుని కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్డీతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయవాది మల్లారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతంలో న్యాయవాది దంపతులను ఇదే తరహాలో నడి రోడ్డుపై అందరు చూస్తుండగానే మారుణ ఆయుదాలతో విచక్షణ రహితంగా హత్య చేసిన విషయం గుర్తు చేశారు. ఇలా న్యాయం జరగలేదనే నేపంతో న్యాయవాదులను చంపివేసే ధోరనికి అడ్డు చేప్పకుంటే పోను పోను తెలంగాణలో న్యాయవాదుల హత్యలు అనేది ఓ ఆనవాయితీగా మారే ప్రమాదం ఉందని వెంటనే న్యాయవాదుల హత్యలపై కఠిన చర్యలు తీసుకుంటూనే న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని జోజిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కొనసాగుతున్న న్యాయవాదుల హత్యకాండలపై తెలంగాణ వ్యాప్తంగా అడ్వకేట్లు నిరసన కార్యక్రమాలలతో రాజకీయ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు బలంగా ఊపందుకున్నాయని ఆయన పేర్కొన్నారు. మెడ. న్యాయవాదిగా తన పని తాను చేసుకుపోవడం ప్రతి అడ్వికేట్ పని అని న్యాయం జరగలేదనే నేపంతో న్యాయవాదులను ఇలా అతి కిరాతకంగా చంపివేడం సిగ్గుచేటన్నారు. మల్లంపల్లి మైనింగ్ భూములకు సంబంధించిన వివాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతోనే న్యాయవాది మల్లారెడ్డి హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా.. నేటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యమని పేర్కొన్నారు. . మైనింగ్ లో భూములు కోల్పోయినవారు, తమ భూములను ఆక్రమించుకున్నారనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం వెనుక దాగి ఉన్న అసలు విషయాన్ని వెంటనే పోలీసులు బహిరంగం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే హత్య ఎవరు చేశారనే విషయంలో పోలీసులు పడుతున్న మల్లగుల్లాల వెనుక రాజకీయ హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.