న్యాయ వ్యవస్థకు పేరు తేవాలి
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: కోర్టుల్లో ఉండే ప్రతికేసు ఫైల్ వెనుక ఒక జీవితం ఉంటుందని, తీర్పు చెప్పే సమయంలో ఈ విషయాన్ని న్యాయమూర్తులు గ్రహిచాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి బి. చంద్ర కుమార్ అన్నారు. జగిత్యాల కోర్టు ఆవరణలో రూ. 40 లక్షలతో నిర్మించే అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవన నిర్మాణానికి, రూ. 35 లక్షలతో నిర్మించే కాసు గంటి లక్ష్మీనరసింహారావు స్మార గ్రంథాలయ భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరం చేయని వ్యక్తిని శిక్షవేస్తే, ఆ శిక్షతో ఆ వ్యక్తి కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుందో ఆలోచించాలని సూచించారు. కోర్టుల్లో చెప్పే తీర్పులు న్యాయమూర్తికి ఆనందం, ఆత్మ సంతృప్తి కలిగించేలా ఉండాలన్నారు.