న్యూజీలాండ్‌తో తలపడే టీ20 జట్టు ఎంపిక
– హైదరాబాద్ యువ ఆటగాడు సిరాజ్‌కు చోటు
– శ్రీలంకటూర్‌కు టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
ముంబయి,అక్టోబర్23(జనంసాక్షి) : న్యూజిలాండ్‌తో తలపడే టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సోమవారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి బోర్డు ప్రతినిధులు, సెలక్టర్లు హాజరయ్యారు. సమావేశం అనంతరం 16మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. నవంబర్ 1 నుంచి కోహ్లీ సారథ్యంలో తలబడబోయే జట్టులో కొత్తగా హైదరాబాద్ ఆటగాడు మహమ్మూద్ సిరాజ్‌కు చోటు లభించింది. పీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సిరాజ్ తన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకున్నాడు. సిరాజ్‌కు తోడు ముంబయి ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తొలిసారి భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ జట్టులో నెహ్రాను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. ఇప్పటికే ఆస్టేల్రియాతో జరిగిన జట్టులో నెహ్రాను ఎంపిక చేయటంపై పలు విమర్శలు వచ్చాయి. కాగా ఆస్టేల్రియాతో టీ20 సిరీస్‌కు ఎంపికై ఒక మ్యాచ్ కూడా నెహ్రా ఆడలేదు. కాగా సోమవారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు నెహ్రా ఎంపికయ్యాడు. నవంబరు 1న ఢిల్లీలో జరిగే టీ20 మ్యాచ్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో నెహ్రాకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 16 నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించారు. ఇందులో చటేశ్వర పుజారా, మురళీ విజయ్ లు తిరిగి చోటు దక్కించుకోగా, టెస్టుల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు చోటు దక్కింది. టెస్టు జట్టులో ఇషాంత్ శర్మకు కూడా చోటు కల్పించారు. మరొకవైపు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ లు కూడా జట్టులో స్థానం దక్కింది.
కివీస్ టీ20 జట్టు ఇదే…
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఆశిష్ నెహ్రా, మహమ్మద్ సిరాజ్.
శ్రీలంకతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లి(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, కుల్దీప్ యాదవ్,హార్దిక్ పాండ్యా, మొహ్మద్ షవిూ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ