న్యూ డెమొక్రసీ అభ్యర్థిగా హలావత్ లింగ్యా
మహబూబాబాద్,అక్టోబర్30(జనంసాక్షి): హలావత్ లింగ్యాను మహబూబాబాద్ నియోజకవర్గ న్యూడెమక్రసీ అభ్యర్థిగా ప్రకటించారు. మహబూబాబాద్ నియోజకవర్గ న్యూ డేమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సదస్సులో ఈ మేరకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా ఉంటున్న న్యూ డేమోక్రసీ పార్టీ అభ్యర్థిని ఈ ఎన్నికలలో గెలిపించాలన్నారు. సామాన్యుడి పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ఎన్నో విప్లవాలు చేస్తూ విప్లవ పార్టీగా మన్నలను పొందుతున్న సీపీఐ ఎమ్మెల్ న్యూ డేమోక్రసీ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గాదె ఝాన్సీ, జిల్లా అధికార ప్రతినిధి చంద్రన్న,జెడ్పీటీసీ గౌని ఐలయ్య,మండల వెంకన్న, ఊకే పద్మ, కొత్తపల్లి రవి,అనసూర్యక్క,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.



