పంచాయతీరాజ్‌శాఖ వార్షిక నివేదిక

xf6wcz4pవిడుదల చేసిన టీఎస్‌ మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ శాఖ వార్షిక నివేదికను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రణాళిక మేర కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంతవరకు లక్ష్యం చేరుకున్నామో ప్రజలనే అడుగుతామన్నారు. పంచాయతీలకు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, పంచాయతీల పరిపుష్ఠం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రజలు కట్టిన పన్నులకు తాము ధర్మకర్తలం మాత్రమేనని, కట్టిన పన్నులకు తగిన పనులు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయన్నారు. ప్రతి పల్లె గంగదేవిపల్లె, అంకాపూర్‌ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.