పంజాబ్‌ మాదే

2

– వందకుపైగా సీట్లు గెలుస్తాం

– దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

అమృత్‌సర్‌,జులై 3(జనంసాక్షి):పంజాబ్‌ ఎన్నికల్లో తాము 100 నుంచి 117 సీట్లు గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆదివారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఆప్‌ అధికారంలోకి వస్తే నెల రోజుల్లో రాష్ట్రంలోని మాదక ద్రవ్యాలు, మాఫియా దందాలను అణిచివేస్తుందన్నారు. పంజాబ్‌లో కెప్టెన్‌ అమరేందర్‌, బాదల్‌లు మొత్తం రాష్ట్రాన్ని లూఠీ చేశారని ఆరోపించారు. ఆప్‌ గెలిస్తే అవినీతి చర్యలన్నింటినికీ అడ్డుకట్ట వేస్తుందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.