పంజాబ్‌ ‘హ్యాట్రిక్స్‌’..

నరేన్‌కు ఐపీఎల్‌6లో తొలి హ్యాట్రిక్‌ వికెట్స్‌
మొహాలీ : మొహాలిలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ గిల్‌క్రిస్ట్‌ 12 బంతుల్లో 7 పరుగులకే ఔటయ్యాడు. సేనానాయక్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మణిదీప్‌ సింగ్‌ 30 బంతుల్లో 41 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కల్లిస్‌ బౌలింగ్‌లో బిస్లాకు క్యాచ్‌ ఇచ్చాడు. వోహ్రా 16 బంతుల్లో 17, హుస్సే 15 బంతుల్లో 12, మిల్లర్‌ 17 బంతుల్లో 20 పరుగులు చేశారు. అజార్‌ మహ్మద్‌, గురుకీరట్‌ సింగ్‌ డకౌట్‌ అయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గోని దూకుడుగా ఆడాడు. 18 బంతుల్లో 42 (4 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేశాడు. చావ్లా 8 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. అలాగే కుమార్‌ 2 బంతుల్లో 1, ఆవానా డకౌట్‌ అయ్యారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌ రైడర్స్‌ 153 పరుగులే చేయగలిగింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ బిస్లా అభిమానులను నిరాశపరిచాడు. మొదటి బంతికే ఎలాంటి పరుగు చేయకుండా కుమార్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. గౌతం గంభీర్‌ 39 బంతుల్లో 60 (9 ఫోర్లు) పరుగులు చేశాడు. కల్లిస్‌ ఆరు బంతుల్లో 1, మోర్గాన్‌ 38 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అలాగే తివారి 7 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. పటాన్‌ 16 బంతుల్లో 13, దాస్‌ మూడు బంతుల్లో 1, భాటియా 16, సేనా నాయక్‌ 8 బంతుల్లో 1, నారేన్‌ 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. బాలాజీ నౌట్‌ట్‌గా మిగిలాడు. పంజాబ్‌ బౌలింగ్‌లో అజర్‌3, ప్రవీణ్‌ 2, ఆవానా2, గోనీ ఒక వికెట్‌ తీశారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు సునీల్‌,. నరేన్‌ వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నమోదు చేసినా విజయం సాధించలేక పోయింది.
2013 ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ సునిల్‌ నరైన్‌ ఘనత
న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2013లో తొలిహైట్రిక్‌ నమోదైంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ సునిల్‌ నరైన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైట్రిక్‌ వికెట్లు సాధించి పంజాబ్‌ వెన్ను విరిచాడు. మొత్తంగా గత ఆరేళ్లలో అతనికి ఇది పదో హైట్రిక్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుస బంతుల్లో డేవిడ్‌ హస్సీ , అజర్‌ మహామూద్‌ , గుర్‌కీరత్‌ సింగ్‌లను వెంటవెంటనే పెవిలియన్‌ దారి పట్టించి ఈ ఐపీఎల్‌లో మొదటి హైట్రిక్‌ నమోదు చేశాడు,
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ 15వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఓవర్‌ మొదటి బంతికి రెండు పరుగులు ఇచ్చిన నరైన్‌ తర్వాతి బంతికి డేవిడ్‌ మిల్లర్‌ ఒక పరుగు తీశాడు . మూడో బంతికి హాస్సి పరుగులేమి తీయలేకపోయాడు. ఒవర్‌ నాలుగో బంతికి హస్సీ వికేట్‌ కీపర్‌ బిస్లాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడ. ఆ తర్వాతి బంతికి మహమూద్‌ బౌలర్‌ నరైన్‌ కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆతర్వాత ఓవర్‌ చివరి బంతికి గుర్‌కీరత్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు.దీంతో బౌలర్‌ సునీల్‌ నరైన్‌ కు హైట్రిక్‌ వికెట్‌ దక్కింది. ఈ హైట్రిక్‌తో నరైన్‌ ఐపీయల్‌ మ్యాచ్‌లలో పది హైట్రిక్‌లు నమోదు చేశాడు. నరైనే హైట్రిక్‌ సాధించిన ఎనిమిదో బౌలర్‌. యువరాజ్‌ సింగ్‌ , అమిత్‌ మిశ్రా రెండేసి సార్లు హాట్రిక్‌ సాధించారు.
ఐపీఎల్‌లో హైట్రిక్‌ సాధించిన బౌలర్లు
సునీల్‌ నరైన్‌ ,కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (2013)
అమిత్‌ మిశ్రా, డెక్కన్‌ క్రానికల్‌ (2008,2011)
యువరాజ్‌ సింగ్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (2009 లో రెండు సార్లు )