పంజాబ్ మాజీ మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష
చంఢీగఢ్: పంజాబ్ మాజీ మంత్రి, శిరోమణి అకాళిదళ్ నేత సుచా సింగ్కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో మోహాలీ పట్టణంలోని కోర్టు ఆయనకు రూ.కోటి జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల శిక్ష విధించింది. 2002లో అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో సుచాసింగ్పై కేసు నమోదైంది.